Friday, December 30, 2011

5 వ తరగతి చదువుతున్న రోజులు


మేము అందరం ఎలిమెంటరి స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్న రోజులు... నేను ఎప్పడికి మర్చిపోలేను. జనవరి ఒకటో తేది వస్తుందీ అంటే ఏదో తేలియని ఉత్సాహం . ఒక వారం ముందునుంచే మా స్కూల్లో సందడి స్టార్ట్ అవుతుంది... కాదు కాదు స్టార్ట్ చేస్తాం...! ఏప్పుడూ జనవరి ఒకటో తారిఖు మా  స్కూల్ కి సెలవుండదని తెల్సినా, ఒకటో తారీఖున సెలవు ఉందో లేదో చెప్పేవరకు మా H .M గారిని వదిలే వాళ్ళం కాదు. ఆయన ఉంది అని చెప్పినా మిగిలిన టీచర్ల చుట్టూ ఒక రౌండ్ వేసి  వచ్చేవాళ్ళంఎవరెవరకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో లిస్టు ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి గ్రీటింగ్ వేయడానికి. లిస్టు చూసుకున్నాక, గ్రీటింగ్స్ ఎక్కడకోనాలి అని చర్చ జరిగేది.  ఇంటి బెల్ ఎప్పుడు కొడతారా అని ఎదురుచూసి... బెల్ కొట్టగానే మా నాన్నమ్మ కుట్టిన సంచి భుజాన వేసుకుని ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళి  కాళ్ళు కూడా కడగకుండా  సంచి ఇంటిలో పెట్టి అమ్మ ఒరే ఒరేయ్ అని పిలుస్తున్నా వెనక్కి చూడకుండా అమ్మా వెంటనే వచ్చేస్తాను... సీత గారి కొట్టి దగ్గరకు వెళ్తున్నా...” అని అమ్మకి వినబడిందో లేదో కూడా పట్టించుకోకుండా పరుగు పరుగున వెళ్ళి గ్రీటింగ్ లు ఏం వచ్చాయో  చూసి, అక్కడ ఉన్న గ్రీటింగ్ అట్టలను అటు ఇటు తిరగేసి చూసి ఆనందించి... ఇంటికి వచ్చేవాణ్ణి.




సారి లిస్టు లో అమ్మాయ్ లు ఎంతమంది ఉన్నారు, అబ్బాయ్ లు ఎంతమంది ఉన్నారు? టీచర్స్ ఎంతమంది ? లెక్కపెట్టుకోవాలి. విషయం ఏమిటంటే  అబ్బాయ్ లు అందరికి హీరో గ్రీటింగ్స్, అమ్మాయ్ లు అందరికి హీరొయిన్ గ్రీటింగ్స్ కొనాలి. టీచర్స్ కి ఫ్లవేర్స్  ఉన్న గ్రీటింగ్స్ కొనాలి అనుకుంటూ నిద్ర పోయేవాణ్ణి.

మర్నాడు ఇంట్రవెల్ టైం లో మా ఫ్రెండ్ అందరిని లైన్ లో నిలబడమన్నాడు. అందరూ నిలబడ్డం ఎందుకంటే  వాడు గ్రీటింగ్స్ కొనేసాడు. అందరు లైన్ లో నిలబడి ఎవరెవరికి గ్రీటింగ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలంట...! వాడికి గ్రీటింగ్ వేస్తాడు. రోజు సాయంత్రం సీతగారి కొట్టిదగ్గరకు వెళ్ళి, అమ్మాయిలందరికి సౌందర్య గ్రీటింగ్స్, అబ్బాయిలకి ఎవరేవరకి హీరో నచ్చుతాడో ముందే తెసుకుని కోనేవాణ్ణి. టీచర్స్ దగ్గరకు వచ్చేసరికి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. వాళ్లకి హీరో,  హీరొయిన్ గ్రీటింగ్స్ వేయకూడదు. కాబట్టి పువ్వులు ఎక్కువగా ఉన్న గ్రీటింగ్స్ చూసి సెలెక్ట్ చేసేవాళ్ళం.
మా మాస్టర్ గోవిందరాజులు గారు మీరందరూ 5 తరగతికి వచ్చారు, ఇంకా గ్రీటింగ్స్ తెలుగు లో రాసి ఇవ్వకూడదు. మీరు ఇంగ్లీష్ లో రాయండి అని బ్లాకు బోర్డు పై ఎలా రాయాలో రాసి చూపించారు.


అందరం నోట్స్ లో రాసుకుని ఇంక ఆఖరి ఘట్టానికి చేరుకొని, గ్రీటింగ్స్ పై పేర్లు రాయడం మొదలు పెట్టాం.
మా అందరికి ఇంగ్లీష్ లో రాయడం అదే ఫస్ట్ టైం కావడం వల్ల From అంటే ఏమిటో, To అంటే ఏమిటో తెలియక ఒక్కొక్కరం ఒకోలా రాసుకుని పంచిపెట్టుకున్నాం. గ్రీటింగ్స్ తో పాటు చాకలెట్స్ కూడా ఇచ్చుకునేవాళ్ళం. మనకి బాగా నచ్చిన ఫ్రెండ్ అంటే రెండేసి చాకలెట్లు, ఫ్రెండ్ అంటే ఒక చాకలెట్టే...!
అలాంటి రోజులను ఎప్పడికి మర్చిపోలేను.. 



మీ అందరికి ఇలాంటి జ్ఞాపకాలు చాలానే ఉండి  ఉంటాయ్ కాదా...! ఒక్కసారి వాటిని గుర్తు తెచ్చుకోండి.
మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలుతో...

------------------------------------------------
జనవరి ఒకటో తేది వస్తుంది అంటే ఏదో తేలియని ఉత్సాహం ,  , ఒక్కసారి ఈ365 రోజుల లో చేసిన- జరిగిన సంగతులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని,కొత్త సంవత్సరంలో చేయవలసిన లిస్టు తయారుచేసోకుని సిద్దమౌతం, అందరినాయకుల వాగ్దానాలు ప్రజలు ఉద్దరించడానికి అయినప్పటికీ .. వాళ్ళ వాగ్దానాలు వేరు వేరు గా ఉంటాయ్.. క్షమించండి మీ లిస్టు ను రాయకియనాయకుల వాగ్దానాలతో పోల్చినందుకు. ఒక్కోక్కరి  లిస్టు రాయడం వరకే సరిపెట్టడం మనకు తెలియనది కాదు. కొత్త సంవత్సరం లో ఎవరెవరు ఏల లిస్టు తయారుచేసుకుంటారో చూద్దాం.. చేయవలసిన పనులు  ఒకటా రెండా ..  కొత్తగా  కట్టవాల్సిన LIC పాలసీని  లిస్టు లో చేర్చిన కొత్త పెళ్ళికొడుకు  , నగ నట్రా కొందాం అంటే వాటి ధర చూసి పేపర్ పై పెన్ కదలక పోయిన ఎదిగిన కూతురి పెళ్ళికి తప్పనిసరి కదా అని దేవుడుపై భారం వేసి రాయక తప్పదు, అల్లుడుగారికి ఈ సంవత్సరం అయిన బైక్ కొనకపోతే అయిన మొఖం ఏల పెట్టుకున్న ... చుట్టాలు మాటలు తట్టుకోలేక బైక్ ని కూడా లిస్టు లోకి ఎక్కించాక తప్పదు, పిల్లల పైచదువులకు కావాల్సిన కోచేంగ్ సెంటర్ లు వెతగడం కూడా లిస్టు లో భాగమే.... ఈ సంవత్సరం అధికార పార్టివాల్లని కొట్టగా తిట్టవాల్సిన లిస్టు , ప్రజలపై వాళ్ళకే తెలియకుండా పన్ను వేసే విధానం కోసం ఆలోచిస్తున్న.......... 

No comments:

Post a Comment