Wednesday, November 25, 2009

మధ్య తరగతి జీవితం .. నీ అబ్బ... జీవితం.. కాని !

నీ అబ్బ... జీవితం.. కాని !

నాకు మధ్యతరగతి జీవితం అంటే ఇష్టం , ఎందుకంటే  నేను  మధ్యతరగతి మనిషినే కాబట్టి. ఎప్పడివరకు సుఖం ఉంటుందో  ... ఎప్పుడు కష్టం వస్తుందో తెలియకుండానే సంవత్సరంలో రోజులు వస్తుపోతున్నాయ్  ... "అదృష్టం -నేను" రైల్వే పట్టాలగా పక్కపక్కనే ఉంటాం. ఎదేమి జరిగిన పెదవుల మీద చిరునవ్వు అరువు తెచ్చుకుని మరీ  నవ్వడం నాకు అలవాటే ...

నేను మా ఆఫీసు వాచ్మెన్  ను అడిగాను మీకు  జీతం ఎంత అని ? ఆయన 3,500 అని చెప్పి O.T చేస్తే 4 ,000 - 4 ,500 వస్తుంది అన్నారు . అయన చేసేది నైట్ షిఫ్ట్ పైగా O .T  లా అనిపించిది. ఆ జీతం లోనే ఇంటి అద్దె , తిండి , పిల్లల చదువులు .... చిన్న చిన్న కోర్కేలకే భగిరద ప్రయత్నం చెయ్యాలి కదా  అనిపించింది . మనిషి జీవితం అంత డబ్బు మీదే ఆదారపడిఉన్నట్ట   అనే ఆలోచన వచ్చింది.

జీవితం లో సుఖపడాలంటే  డబ్బు కావాలి .... డబ్బు కావాలంటే సుఖాన్ని వదులుకోవాలా  ..ఏమిటిది... అందుకేనేమో .. వేదం సినిమాలో .. రూపాయ్ అనే పాటలో

"kotalu medalu kattalanna
katiki naluguru moyalanna
guppedu metukulu puttalanna
pranam teeyalanna
rupaayi rupaayi."

.--- డబ్బు విలువను సింపుల్ గా వివరించాడు .. ఈ రోజుల్లో  పెరిగిన ధరలకి వచ్చే జీతాలకి  మధ్యతరగతి వాడి జీవితం రోజు రావణ కాష్టే  ... ఇవన్ని ఆలోచిస్తుంటే ఎవరికైనా నీ అబ్బ జీవితం  కాని అనిపించకుండా ఉంటుందా !

మన జీవితాలు ఇలా ఉండటానికి కారణం ఏమిటని  ఆ.. లోచిస్తే వెంటనే గుర్తుకు వచ్చేది . రాజకీయ నాయకులే  ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి ఏమిటి తమ్ముడు అని లేదా అన్నయ్య అని పలకరించి పదవికాలం ముగిసేదాకా వాళ్ళకు మనం ఏలా ఉన్న ఒకటే .. మార్కెట్ కి వెళ్లి కూరగాయలు ధరలు అడగాలంటేనే భయం వేస్తుంది.. మోజుతో అత్తగారిని బెదిరించి కొనుకున్న బైక్ కి బయటకు తిద్దామాంటే పెట్రోల్ లేక బైక్ నావంక అదోల చూస్తుంది.  సరేలే ఏదోవిధంగా   జీవితం  నడుస్తుంది అంటే మధ్యలో ఈ ఉద్యమాలు ఒకటి,  దానికి తోడూ బంద్ లు .. ఎవిరితోనైనా మాట్లాడాదం అంటే నువ్వు ఏ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నావ్ అని  ప్రశ్న ఒకటి .. ఎవడితో ఏంచెప్పిన ఏదో ఒకటి తంటా వాళ్లతో.

మన రాజకీయనాయకులకు ఉన్నట్టు ఉండి. అక్కడెక్కడో దాచిన నల్ల డబ్బు గుర్తుకు వస్తుంది వాటిపైన ప్రతివోడు మైకు ఇచ్చుకుని  నల్లడబ్బును తెచ్చేస్తాం పేదలకు పచ్చేస్తాం  అంటే పిచ్చిమనస్సు ఎక్కడికో ఒకసారి ఉహలలోకి వేల్లివచ్చేసరికి .. న్యూస్ చానెల్ లో విరామం తరువాత అని చెప్పేసరికి మనస్సు  తిరిగి వచ్చేస్తుంది. నిజంగా వాళ్ళు డబ్బు పంచిపెడితే బలే ఉంటుంది కాదా అనుకుంటాను. ఐన మన పిచ్చికాని ఎవరిదో ఒకరిదో ఇద్దరిదో రాజకియనాకులది ఉంటె తెస్తారుకాని అందరి డబ్బులు అక్కడే ఉంటె ఎవరుతేస్తారు నా పిచ్చికాని.


షాజహాన్ చనిపోయిన భార్యకోసం తాజ్ మహల్ కట్టిస్తే ..... మరి మధ్యతరగతి వాడు బ్రతికున్న భార్యకోసం  ఏమి చేయలేక.. ఆమె ఇచ్చిన "టీ " త్రాగుతూ .. టీవీ 9 లో న్యూస్ చూస్తూ.. మనస్సు లో అనుష్క లాగా "ఎగిరిపోతే ఎంతబాగుంటుంది ....." అని తన భార్యకు వినపించకుండా మనస్సులో  పాడుకొంటున్నాడు  .......

----
బాగానే ఉందా?

18 comments:

  1. Title adhirindhi Raajaa...
    keep it up. neeku theliyakundane SMO chesethunnnav....

    ReplyDelete
  2. Meeru ea party ani adigithey parvaledhu,adhi mana rashtra nayakulu chesina pani..

    Meedhi ea prantham ani aduguthunnaru raaja ippudu..

    ReplyDelete
  3. ekkadunte ade niprantam ani cheppu .......

    edi emaina manam A.P ye kada.

    :)

    ReplyDelete
  4. video bhagundhi rajaa..

    Edhaina mana chethilo ne undhi, evaro vachchi edho chestharani wait cheyadam waste

    ReplyDelete
  5. mama super

    its great thought

    continue it

    its a good habit

    ReplyDelete
  6. ea prantham varu ane adegethe eme kadhu , endhukante telangana ne goppaga chudale , antha vere prantham varea bagu paduthunnaru , ekkadeke vatche na vare bagu paduthunru , akkada velle na vare bagu paduthunru , british vare laga ,varu india ke vatche india medhe adhe pathyam chese nattu , andhuke ea prantham varu ane adugale.

    ReplyDelete
  7. sagatu manishi jeevithaannam ippudu ilane undi
    daanigurinchi baaga chepparandi.

    ReplyDelete
  8. sagatu manishi jeevithaannam ippudu ilane undi
    daanigurinchi baaga chepparandi.

    ReplyDelete
  9. సూపర్ .... అటూ ఇటూ కానే జీవితం మధ్యలో వేలాడుతూ...

    ReplyDelete
  10. సూపర్ .... అటూ ఇటూ కానే జీవితం మధ్యలో వేలాడుతూ...

    ReplyDelete