Monday, September 26, 2016

నీతో గడిపిన మధుర క్షణాలు

     ఏమిటి ఆ క్షణాలు అనుకుంటున్నావా ! ఎన్నన్ని చెప్పను చెప్పు .. 
ఒకట రెండా రాస్తే పెద్ద గ్రంథం అవుతుందేమో .
ఆ..  కోప్పడకు ఇంతకాలానికి ఇప్పడికి సమయం దొరికింది . ఈ చల్లటి గాలి తగులుతూంటే నువ్వు నన్ను వెనకాలనుంచి వచ్చి ప్రేమ గా హద్దుకున్న క్షణాలు గుర్తుకోస్తున్నాయ్ .
****** 

మన పెళ్లి జరుగుతున్నప్పుడు గుర్తుందా నీకు ...
చుట్టురా అందరూన్న నేను అవి ఏవి పట్టించుకోకుండా మన మధ్య లో కట్టిన దుప్పటి క్రిందనుంచి నీ కాళ్ళ వేళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తూంటే దొంగచూపులు చూసాను . అప్పుడప్పుడు నువ్వు పూజలు చేస్తూ నీ చేతికి తడౌవుతుంటే ఆ తెల్లటి kerchief కు తుడుస్తూ ఉన్నప్పుడు నీ చేతులను చూసేవాణ్ణి . ఆ చేతులేగా నేను జీవితాంతం పట్టుకోవాల్సింది ( పట్టుకోకపోతే చంపేయవు  :) )అనుకుంటూ చూస్తూ ఉండేవాణ్ణి ఎప్పుడు ఈ దుప్పటి అడ్డు తీస్తారా అని . జీలకర్ర బెల్లం ఘట్టం ఎలా మరువగలను నీకళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే . అందరిలోనూ నువ్వు చూడలేక కాస్త సిగ్గుపడుతూ తల దించుకుని రెండు క్షణాలాగి నువ్వు చూసిన చూపు ఎన్ని జన్మలకు మరువగలను . ఫ్రెండ్స్ అందరు తల పైకి ఎత్తార అంటే నేను తల పైకి ఎత్తబోతుంటే నా తలపై జీలకర్ర బెల్లం దానిపై నీ చెయ్యి .. కనబడవ్ కాని నువ్వు చేత్తో తలపైకి ఎత్తకుండా తలపై నొక్కావ్ చూడు .. అప్పటినుంచి తలపైకి ఎత్తే అవకాసమే రాలేదు :)

తాళి కడుతున్న ఘట్టం ఉంది చూసావు .. ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు అంత టెన్సన్ పడలేదు . ఎవడు లేచి ఆపండి అంటాడేమో అని . ఎవడు ఆపినా నేను ఆగాను అనుకుంటూ తాళి కట్టాను తెలుసా .. ఆ వెనకాల ఉన్నవాళ్లు నువ్వు 4 ముళ్ళు వేసావ్ అంటూంటే .. ఆసలే నా కంగారు లో నేనుంటే వీల్లోకరు మద్యలో అనుకున్నా . కోతికి కొబ్బరికాయ దొరికినట్టు తలంబ్రాలు అని అనగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది . దానికితోడు ఫ్రెండ్స్ పోసేయ్ పోసేయ్ అంటూంటే .. ఆహా అప్పుడు తెల్సింది నువ్వు సామాన్యరాలువి కాదని . నాకంటే స్పీడ్ గా పోస్తూంటే నాకు తగ్గ జోడినే అనుకున్నా . నీకో విషియం తేల్సా నువ్వు మీ నాన్నగార్ని వదిలి కార్ ఎక్కుతున్నప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే మామయ్య గారు నేను ఉన్నాను ఏమి బెంగవద్దు అని చెప్పాలని ముందే question paper లీక్ అయితే ఆన్సర్ తేల్సినట్టు ప్రిపేర్ అయ్యాను . కాని నీ కళ్ళలోంచి కన్నీళ్ళు ముత్యాలు రాలుతున్నట్టు .. శివుడి తలపై నుంచి గంగమ్మ దూకుతున్నట్టు కన్నీళ్ళు  వస్తూంటే నాకు ఏమి చెయ్యాలో తేలియలేదు నీ భుజం పై చేయ్యివెయడం తప్ప . అన్నవరం వ్రతానికి వెళ్తున్నాం అప్పుడు నీ అరిచేతిని నా అరిచేతిలో బంధించి నీ దుఖాన్ని ఆపడానికి నా చేతితో మౌన భాషగా చాలానే చెప్తున్నాను నీకు వినిపించాయో లేదో మరి .
కార్ వెళ్తూంది మన తో పాటు వస్తున్నా పెద్దవాళ్ళు నన్ను ఏదో అడుగుతున్నారు నేనేదో చెప్తున్నాను కాని నా ద్యసాంతా నీ పైనే . నీ కళ్ళు బాగా ఎరుపెక్కాయ్.. ఉన్నట్టు ఉండి మా పెద్దమ్మా కు కడుపులో వికారంగా ఉంది అంటే కార్ ఆపుచేసారు ..డ్రింక్ లు టీ లు త్రాగి . నీకో డ్రింక్ ఇస్తే నాకు వద్దు అంటూ సగం తాగి వదిలేసావ్ .. ఆ తరువాత కదా నువ్వు మామోలు మనిషివి అవుతా . నాకు ఏమనిపించిందో చెప్పనా ఈ పెద్దమ్మ కు ఓ అరగంట క్రితమే వికారంగా ఉంటే బాగున్ను అనిపించింది :)
 *****
నేనేదో ఆలోచిస్తున్న ఆ రోజు .. ఏవండి ఏవండి అని నువ్వు పిలుస్తున్న వినబడని పిలుపు ఓయ్ అని పిలిచేసరికి ఈ లోకం లోకి వచ్చాను . ఏమిటే .. ఓసారి ఇలా రండి .. ఆ చెప్పు .. నువ్వు చెప్పినది  అంత విన్నాక నీవైపు చూస్తున్న ఇంకా ఏదో చెప్తావ్ అని .. నీ మొహం లో భావాలూ మారడం గమనించి తరువాత అన్నాను . నువ్వు కోపంగా నేను చెప్పింది జోక్ అన్నావ్ .. తేరుకున్న నేను నీ కోసం 5 నిమిషాలు ఆగకుండా నవ్వాను .. నాకేంతెలుసు నీకు నవ్విన కోపం వస్తుంది అని .. పక్కన ఉన్న తలగడితో కొట్టి ఆపండి ఇంక .. మీరు రోజు చెప్పే కుళ్ళు జోకిలికి నేను నవ్వడం లేదా  అన్నావ్ .. ఓర్ని ఇంకా నయం 30 స॥ తరువాత అంత మీరే చేసారు అని అనలేదు . సరే ఇకపై నేను జోక్స్ చెప్పను .. చెప్పకుండానే నవ్విస్తా .. అన్నాను . నువ్వు కళ్ళు రెండు ఎగరేస్తూ ఎలానో అన్నావ్ . అప్పుడు నేను నిన్ను దగ్గరకు తీస్కుని కితకితలు పెట్టడం స్టార్ట్ చేశాను . 15 ని ॥ తరువాత నీ కళ్ళలో నవ్వలేక ఆనంద భాష్పాలు వస్తుంటే ఆపాను . నువ్వు రెండు నిమిషాలు ఊపిరి పీల్చుకుని నా బుగ్గ కోరికి పారిపోయావ్ .. ఎలా మరువగలను .
****

Monday, June 9, 2014

తాజ్ మహల్

మనవాళ్ళకి ఎప్పడికప్పుడు ఏదో ఒక సంచలన వార్త కావాలి .. అది నిజమైన అబద్దం అయిన
ముంతాజ్ పై షాజహాన్ కి ప్రేమ ఉందో లేదో అని ఆయన చరిత్ర రాస్తారు .. 
 

 
ముంతాజ్ మొదటి భర్తని షాజహాన్ చేతిలో ఎలా చనిపోయాడు అని .. ఆ తరువాత ఆయన ఎంతమందిని మ్యారేజ్ చేస్కున్నాడో .. అవన్ని రాస్తారు .
అసలు ఆ తాజ్ మహల్ సమాధి కాదు శివాలయం అని తాజ్ మహల్ పైన పూర్ణకుంభం లా ఉన్న సింబల్ చూడండి అని మరో కధనం .
మన దగ్గర అన్ని  ఆధారాలు ఉన్నప్పుడు ... నిజాలు ఎందుకు బయటపెట్టారు ? అది నిజంగా శివాలయం ఐతే మనవాళ్ళు ఎందుకు చూస్తూనే ఉన్నారు ? కనీసం ఇప్పుడైనా నిజాలు కోసం అన్వేషించవచ్చు కదా ? ఎంతకాలం యుటూబ్ / పేస్ బుక్ లో పోస్ట్ చేస్కుంటారు ..

సలహాలు ఎవరికి ఇవ్వకూడదు ?


1) వీళ్ళు మనల్ని సలహాలు అడుగుతారు , మనం సలహా ఇచ్చేలోపే వాళ్ళే ఏది మంచిదో ఎలా చేస్తే బాగుంటుందో చెప్పేస్తారు .
మనం వారి సందేహం , సలహా రెండు విని ఇంటికి వచ్చేయడమే మనకు పెద్దగ పనేం ఉండదు వీళ్ళ దగ్గర :)



2 ) వీళ్ళు సలహాలు అడుగుతారు , పాటిస్తారు కూడా ఎప్పుడంటే వీళ్ళు ఏమి అనుకుంటున్నారో అది మనం చెప్పినప్పుడు
3 ) వీళ్ళు చేయబోయే పని కొంత రిస్క్ తో కూడుకున్న పని , రిస్క్ కూడా వాళ్ళే బరిస్తారు కాకపొతే తేడా వస్తే ఆ పని చేయమన్నది మీరే అని సలహా చెప్పినందుకు నాలుగు అక్షింతలు మీపైనే వేస్తారు .
4) వీళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఏ సలహా కోసం మీమ్మల్ని సంప్రదించారో అదే విషియం పై మళ్ళి అడుగుతారు .. అప్పుడు సలహా ఏమి ఇచ్చారో మీకు గుర్తుంటుంది కాని వాళ్ళకి ఉండదు .
5) అనుకోకుండా కలిసినప్పుడు , లేదా మీరే వాళ్ళకి కాల్ చేసినప్పుడు పనిలోపనిగా సలహా అడుగుతారు అది చాల ముఖ్యమైనది గా చెప్తారు .
ఏ . సి కోసం atm కి వెళ్ళినప్పుడు బాలన్స్ చెక్ చేస్కున్నట్లు
6) వీళ్ళు సలహా అడుగుతారు .. మీరు చెప్పే సలహా కూడా వింటారు . కాని అప్పడికే ఆపని పూర్తయి చాల కాలం అవుతుంది . మీమ్మల్ని అడిగుంటే ఏమి చెప్పేవారో అని తెల్సుకోవడానికి అడుగుతారు .
7) మీరిచ్చిన సలహాకు వ్యతిరేకంగా అక్కడ పని జరుగుతుంది . ఏమంటే అలా కంటే కూడా ఇలా ఐతే  బాగుంటుందాని ఇలా చేశాను అని చెప్తారు .
8) వీళ్ళు ఇంతకముందే పని స్టార్ట్ చేస్తారు . పని స్టార్ట్ చేసాక సలహా అడుగుతారు . మన అభిప్రాయం తిస్కోవడానికి కాదు జస్ట్ వీళ్ళు ఏమి చేయబోతున్నారో తెల్సుకోవడానికి .
అర్ధం కాలేదా ? విజయవాడ  వెళ్తున్నా బస్సేక్కి టికెట్ తీస్కుని పక్కనున్నా వాళ్ళను అడుగుతారు ఇది విజయవాడ వెళ్తుందా అని .
9 ) వీళ్ళు  మనల్ని సలహాలు అడగరు,  మనం కనబడిన సరిగా పలకరించారు . వీళ్ళు తప్పు  చేస్తున్నట్టు / అలా చేస్తే వీళ్ళు నష్టపోతారన్నది మనకు బాగా తెలుసు . వీళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్లై ఉంటారు . మనమే పిలుపించుకుని వీర్కి సలహాలు ఇస్తాం . మనం చెప్తున్నాంత సేపు చాల శ్రద్దగా వింటారు . విని వెళ్ళిపోతారు
10 ) వీళ్ళకు మనం సలహాలు ఇంకేప్పుడు ఇవ్వకూడదు అని అనుకుంటాం . మీరు తప్ప నాకేవ్వరు ఉన్నారు అని మళ్ళి తిరిగి వస్తారు . నేను చాల మారిపోయాను  ఇంతక ముందులా కాదు అని వాళ్ళకే వారే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటారు . అంత కంటే నాకేం కావాలి అని మరో సలహా ఇస్తాం ..

Monday, March 24, 2014

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

* 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం

* 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
* 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
* 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
* 1955 : రామారావు కామారెడ్డి
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
* 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
* 1957 : సీతాకుమారి బన్స్ వాడ
* 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
* 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
* 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : కే.వి.రెడ్డి బోదన్
* 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
* 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
* 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
* 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
* 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎస్.భూపాల్ అమరచింత
* 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
* 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
* 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
* 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
* 1981 టి.అంజయ్య రామాయంపేట
* 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి

Tuesday, February 25, 2014

నీవు నన్ను వదిలివెళ్తున్న ఆ క్షణం

నీవు నన్ను వదిలివెళ్తున్న ఆ క్షణం
ఒంటరినై ఒంటరిగా నీ వైపే చూస్తున్న
గుండె ఎప్పుడు లేని వేగంగా స్పందిస్తూ
నా పెదవుల మూగబోయిన ఆ క్షణం
హృదయం మాత్రం నీకై కేకలు వేస్తూంది

నడుం వంపుల మధ్య అటు ఇటు కదలే
నీ వాలు జడ , సెలవంటూ వెళ్తోంది
నా గొంతు బరువై మూగబోయింది
నీ కోసం ఎదురు చుస్తున్నాను అన్నట్టుగా
నా కన్నీళ్ళు భూమాత పై ఒట్టు వేసాయ్ 

నీ వెళ్తూ చూసిన ఆ చివరి చూపు
రామబాణమై నా హృదయాన్ని తాకి
కంటికి కునుకు లేకుండా చేసింది
నీ రాకకై వేయికన్నులతో చూస్తున్న
సునామి లాంటి నీ ప్రేమతో నన్ను
ముంచివేయ్ .. నీలో కలిపేయ్ 

Friday, February 14, 2014

Shakilaa

తనదగ్గర నుంచి ఎవరికేమి కావాలో అవి తీస్కున్నారు ..
 ఇప్పుడు తనకి తానుగా మిగిలింది

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2014/02/13/ArticleHtmls/13022014101011.shtml?Mode=1

Wednesday, February 12, 2014

ఓ మీత్రమా ఆగు

ఓ మీత్రమా ఆగు , ఒకసారి ఇటువైపు చూడు
ఎక్కడికి నీ ప్రయాణం , ఒంటరిగి నింగికి ఏగురుతావ
ఏ కష్టమనే సునామి నిన్ను ఇంతవరకు లాగింది
నీ కష్టాలను పంచుకోవడానికి నేను లేనా మీత్రమా ?

చిన్నప్పటి మన మధుర  జ్ఞాపకాలు నాకిచ్చేసి
నీ కుటుంబాన్ని గాలి కోదిలేసి , ఎక్కడికి వెళ్తున్నావ్
మరో జన్మ మన చేతుల్లో లేదు , ఏదైనా ఇక్కడే ఇప్పుడే
చేద్దాం , చేతకాని పిరికివాడు నిందతో వెళ్లి పోతావ ?

ఏం ఉంది కష్టం , ఏం అంత కష్టం , నీకేనే కష్టం
పురిటి నోప్పులు కష్టం అనుకుంటే నువ్వు ఉండేవాడివా ?
కాలం కలిసి రానప్పుడు పాండవులు భిక్షగాళ్ళు కాలేదా ?
కవిసార్వ భౌముడు కోరాడ దేబ్బలు తినలేదా ?

నీకు తేలియనీవా చెప్పు , తొందరేలా మీత్రమా
సమయం కోసం వేసిచూద్దాం , కాలం తో పోరాడదాం
రా మీత్రమా రానున్న రోజులు మనవే , పోరాడదాం
పోగుట్టుకున్నవి అన్ని పొందేవరకు పోరాడదాం