Tuesday, January 7, 2014

అభిమాన భానిసలం

అభిమాన భానిసలం :
ఊహ తేల్సినప్పటినుంచి ఒక్కో వయసులో ఒక్కొక్కరిని ఇష్టపడుతూ అభిమానిస్తూ ఉంటాం . వయసు పెరుగుతున్నప్పటి నుంచి అలవాటులు కొత్త పరిచియాలతో అభిమానించే వ్యక్తులు కూడా మారుతుంటారు . మొదట్లో ఆయనంటే ఇష్టం అని మమోలుపదజాలలు ఉపయోగిస్తాం . తరువాత చాల ఇష్టం , చివరకి తనకోసం ప్రాణం ఇస్తాను అనే స్తాయివరకు వెళ్తుంది .
ఒక వ్యక్తీ ని అతనిలో టాలెంట్ చూసి ఇష్టపడుతూ వస్తాం .. అదేరంగం లో ఉన్న మరోకవ్యక్తితో ఇష్టపడుతున్న వ్యక్తిని పోలుస్తూ  .. మనం ఇష్టపడుతున్న వ్యక్తే గ్రేట్ అని సంబరపడిపోతాం  . చివరకి మన అభిమానం అవతలి వ్యక్తిని అభిమానించే వాళ్లతో మాటల పోటిలకు దిగుతూ .. మన అభిమానించేవాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వాటిపైన కూడా సుదీర్ఘ చర్చలు చేసి అవతల అభిమానుల్ని జయించే ప్రయత్నం చేస్తాం . 
 
 

మొదట్లో ఎవరిననైతే అభిమానిస్తున్నమో వాళ్ళను చూడాలని , వాళ్లతో ఫోటో లో దిగాలని , ఒక్కసారైనా మాట్లాడాలని ఉంటుంది . తనల జీవించాలని తనను ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తాం . తరువాత అభిమానం ముదిరి వాళ్ళు ఎలా ప్రవర్తించాలో , ఎలాంటి నిర్ణయాలు తీస్కోవాలో కూడా మనమే డిసైడ్ చేస్తాం . ఇది ఇలా ఉండగా ఆ వ్యక్తీ ఏదైనా తప్పుచేస్తే ఆ తప్పుని కవర్ చేసేపని కూడా తన బాధ్యతగా తీస్కుని మావాడు ఒక్కడే చేశాడా , ఎందుకు చేయకూడదు అంటూ మన కుటుంబ గౌరవం రోడ్ మీద పడుతున్నట్టు ఫీల్ అయిపోయి .. ఎదుటు వాళ్ళమీద దండయాత్ర చేస్తాం .

ఆ అభిమానం నటుడు పైన ఉంటే ఆయన ఎలాంటి సినిమాలు తియ్యాలి , ఎవరితో తియ్యాలి వాళ్ళ ఫ్యామిలి ఎలా ఉండాలి . వాళ్ళ కొడుకు ఎవర్ని పెళ్లి చేస్కోవాలి . కూతుర్ని
ఎవర్కివ్వాలి   మొత్తం ఫ్యామిలీ నిర్ణయాలు కుటుంబ పెద్దగ చుస్కోవాడం మొదలుపెడతాడు . నాయకుడు మీద ఐతే ఇది కాస్త ఎక్కువమొదాదు లో ఉంటుంది . తను అభిమానించే నాయకుడు తప్ప మీగిలినా వాళ్ళెవరు కూడా ప్రజా సేవకి పనికిరారు . చంద్రుడికైన మచ్చుందేమో కాని తమ నాయకుడికి ఎలాంటి మచ్చలేదని ప్రచార బాద్యతలు తనే స్వీకరిస్తాడు . కనీసం ఒక్కసారికూడా చూడని నాయకుడికోసం సొంత అన్నదమ్ములతోటే తేగదేంపులు చేస్కోవడానికి కూడా వెనకాడడు .

అంతగా అభిమానించి తన స్థాయిని కూడా మరిచి అన్నివదులుకుని .. తను అబద్దం చెబుతున్నాని .. ఎన్నోసార్లు పక్కవాళ్ళని కూడా అనకూడని మాటలడానని .. ఇతరులపై బలవంతంగా తన అభిప్రాయాలను రుద్దడానికి కూడా చూశానని .. తన మన సాక్షి చెప్తే కాని తెల్సుకోరు . ఏమి సాధించం అంటే ఏమి ఉండదు . సొంతవాళ్ళకి దూరం అవ్వడం తప్ప ..

No comments:

Post a Comment