Wednesday, August 10, 2011

మాస్టర్ గారి అమ్మాయ్

నేను ఆఫీసు కి వెళ్తున్నాను కాని నిన్న రాత్రి  అమ్మ నాతో "ఒరే వినబడుతుందా నేను చెప్పేది. మీ నాన్నగార్కి , మీ మామయ్యా ఫ్రెండ్ భాస్కర్ గారు ఫోన్ చేసారాంటా. వాళ్ళ అమ్మాయ్ నీకు గుర్తు ఉందా  ఉమ?  తనకి నిన్ను అడిగారంట... మీ నాన్నగారు నిన్ను అడగమన్నారు నీ అభిప్రాయం ". దేనికమ్మ ఆడగటం అన్నాను నేను .. ఎందుకేమిటిరా నువ్వు పెళ్లి చేసుకోవా? అన్నది అమ్మ. నిజం చెప్పాలంటే ఉమ నాకు ఎవరో పూర్తిగా గుర్తులేదు. నా చిన్నప్పుడు మేము  మా తాతయ్య గారి ఇంటిదగ్గర ఉండేవాళ్ళం. నా 10th  తరువాత నాన్న బిజినెస్ పనిమీద మేము హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఆలోచిస్తూ ఉండగానే ఆఫీసు కి వచ్చాను. మా బాస్ నాకు బాగా క్లోజ్.. తను మా కాలేజీ లో నా  సీనియర్.. ఆఫీసు విషయాలు నాతో షేర్ చేసుకోవడం మా బాస్ కి అలవాటు. తనకి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయ్యింది. లంచ్ టైం లో అడిగాడు ఏరా ని మ్యారేజ్ ఏప్పుడు అని. అమ్మ చెప్పింది చెప్పాను తనకి. మరీ నువ్వు ఏం చెప్పావ్ రా మీ అమ్మగారితో అన్నాడు. ఏం చెప్పలేదు ఇంకా..చూడాలి. నీకో విషయం చెప్పనా నా చిన్నప్పుడు మా మాస్టర్ గారి అమ్మాయ్ అంటే ఇష్టం నాకు ఇప్పుడు ఎలాఉందో ? ఎక్కడుందో ? కూడా తెలియదు. నా 10 th  తరవాత మళ్ళి మా తాతయ్య గారి ఇంటికి వెళ్ళలేదు సో నాకు తన గురించి ఏం తెలియదు అన్నాను. మా బాస్ వెంటనే నాతో ఒక పని చేయరా ఐతే ఎలాగో అమ్మాయ్ ని చూడాలి అంటున్నావ్ గా ...ఆ ఆమ్మాయ్ ని చూస్తానని చెప్పి మీ తాతయ్య గారి ఇంటికి వెళ్లి .. మీ మాస్టర్ గారి అమ్మాయ్ ని చూసి రా..అని ఐడియా ఇచ్చాడు. నా ఐడియా తో నీ జీవితం మారిపోతుంది అని ఆశ్విరిదించాడు.
ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అని పించింది. అమ్మ తో చెప్పి చూద్దాం అనుకున్నాను తాతయ్య గారి ఇంటికి వెళ్తాను అని . ఆఫీసు అయింది ఇంటికి వెళ్ళగానే అమ్మ నాతో "ఏరా.. నాన్న గారు అడిగారు వాడు ఏం చెప్పాడు అని నువ్వు ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఏమిటిరా అర్ధం. మీ నాన్నగారికి ఏం చెప్పాలి నేను. ఏదో ఒకటి చెప్పరా ". అమ్మ నేను ఒకసారి తాతయ్య గారి ఇంటికి వెళ్తాను అన్నాను.. అమ్మాయ్ నీ చుస్తావా? అని డైరెక్ట్ గా అడిగింది అమ్మ. అమ్మ కి నా స్టొరీ అంత ఇప్పుడు ఎందుకు చెప్పడం అని పించింది. హా ఒకసారి అమ్మాయ్ నీ చూస్తాను అమ్మ అని చెప్పను. ఓకే నాన్న గారితో చెప్తాను ఐతే అంది. సరే కాని రా భోజనం చేద్దువ్ గాని అని భోజనం పెట్టింది. నైట్ నాన్న గారితో అమ్మ చెప్తూ ఉండగానే .. నాన్న.. ఏం చూసి మాట్లాడితే కాని పేళ్ళి  చేసుకోడా వాడు . ఫోటో పంపుతాను అన్నాడు భాస్కర్ .. సెల్ నెంబర్ కూడా ఇస్తాను అన్నాడు. వీడిని ఫోటో చూసి సెల్ లో మాట్లాడమని చెప్పు. విడు వెళ్లి ఏం చేసు మాట్లాడవలిసిన అవసరం ఏం లేదు. అమ్మ నాన్న తో వాడు ఏం అడిగాడండి . ప్రత్యేకంగా అమ్మాయ్ ఇంటికి వెళ్తాను అనలేదు కదా  తాతయ్య గారి ఇంటికి వెళ్లి .. అమ్మాయ్ నీ చూసి వస్తాను అన్నాడు. వాడు వేరే అమ్మాయ్ నీ లవ్ చేశాను.. పేళ్ళి చేసుకుంటాను అనలేదు కాదా. ఒప్పుకొండి ఎందుకు కోప్పడతారు. నాన్న "సరేలే నువ్వు నిర్ణయం తీసుకున్నావ్ గా వెళ్లి రామ్మను ఐతే . నేను భాస్కర్ గాడికి కూడా చెప్తాను.

అమ్మ వచ్చి నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. మా బాస్ నాకు పర్మిషన్ ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయ్. కాని రైల్వే వాళ్ళే  పర్మిషన్ ఇవ్వలేదు నాకు. సో ప్రయాణం బస్సు లో అన్నమాట . నాకు ట్రైన్ ప్రయాణం అంటే పెద్దగ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పడివరకూ ఒక్క అమ్మాయ్ కూడా పరిచయం అవ్వలేదు నాకు. మొత్తానికి బస్సు టికెట్ దొరికింది. మా ఇంట్లో వాళ్ళకి నేను ఎందుకు వెళ్తున్నానో తెలియదు. అందరికి బాయ్ చెప్పి బస్సు ఎక్కాను. నా పక్క సీట్ లోకి ఒక అమ్మాయ్ అలసిపోయినట్టు  వచ్చినట్టు కూర్చుంది. చెమటలు బాగా పట్టాయ్ తనకి వాటర్ బాటుల్ కూడా తీసుకు రాలేదు అనుకుంటా. తనే వాటర్ అడిగింది నాన్ను. మహేష్ బాబు thums up ఆడ్ లో  డ్రింక్ ఇచ్చినట్టు వాటర్ ఇచ్చాను. తనే మాట్లాడ్డం స్టార్ట్ చేసింది.. ట్రైన్ టికెట్ ఉన్న .. ట్రైన్ మిస్ చేసిందంట.. ఫ్రెండ్ పేళ్ళి కి విజయవాడ బయలుదేరింది. బస్సు ప్రయాణం అల అలా సాగుతుంది.

మీరు ఎక్కడిదాకా అని అడిగింది తను.. నేను మా తాతయ్య గారి ఇంటికి వెళ్తున్నాను. మా అమ్ముమ్మ గారికి ఆరోగ్యం బాలేదు అనిచేప్పను. ఇంకా ఏమిటి మీ గురించి చెప్పండి అన్నాను.. ఇంతలోపే తనకి కాల్ వచ్చింది ఇంటి దగ్గరనుంచి .. ట్రైన్ మిస్ అయింది అమ్మ .. బస్సు లో వెళ్తున్నాను అని చెప్పింది.. తరువాత మాట్లాడ్డం స్టార్ట్ చేసాం తను పర్సనల్ విషయాలు ఏం మాట్లాడకుండా ... సరదా ఉంటాను అందరితో, ఫ్రెండ్ తో చాట్ చేస్తాను.. సాంగ్స్ వింటాను.. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం.. క్రికెట్ చూస్తాను.. అని పెద్ద లిస్టు చెప్పింది.. నాన్ను పర్సనల్ విషయాలు అడగకండి అని చెప్పినట్టు నాకు అర్ధం అయింది. నేను కూడా అలాగా మాట్లాడ్డం స్టార్ట్ చేశాను తనతో..అవునులే పక్క సీట్ లో కుర్చున్నాంత మాత్రాన మనకి అన్ని చెప్తారా ఏమిటి అని పించింది.. ఇంతలో నాన్నగారు  ఫోన్ చేసారు..బస్సు ఎక్కడ ఉంది.?. తిన్నావా లేదా?.. .. ఆడగటం అయ్యాక.. నువ్వు బస్సు దిగిన వెంటనే మీ మామయ్యా కి కాల్ చెయ్ అని చెప్పారు. అలాగే అన్నాను.  నాన్నగారు  అంటే నాకు భయం పెద్దగ ఏప్పుడు నేను నాన్న గారితో మాట్లాడలేదు. అన్ని అమ్మ  తోనే చెప్తాను నేను... అప్పుడే టైం 10 pm  అవుతుంది . గుడ్ నైట్ చెప్పుకున్నాం ఒకరికి ఒకరం..

 మార్నింగ్ లేచే టైం కి కాకినాడలో ఉన్నాను నేను, పక్క సీట్ లో అమ్మాయ్ కూడా లేదు.. విజయవాడ వరకే కదా తను మరిచాను . తన నెంబర్ అడిగితె బాగున్ను అనుకున్నాను ..మాది కాకినాడ దగ్గర ఒక పల్లెటూరు.. ఇంతలో మామయ్యా ఫోన్ ఏరా అల్లుడు వచ్చావ లేదా ఇంకా..అని.. మా మామయ్యా చందమామ  సినిమా లో ఆహుతి ప్రసాద్ క్యారెక్టర్ ఆయనది. నన్ను  ఇంటికి తీసుకువెళ్ళడానికి మా మాయ్యగారి పంపిన ఒక అతను వచ్చాడు.. కాకినాడ నుంచి రెండు గంటల ప్రయాణం మావూరు కి ..అసలు తను ఏల ఉందో? ఏమన్నా చదువు తుందా? ఒకవేళ మ్యారేజ్ కూడా అయిపోయిందా ? లేదులే మ్యారేజ్ చేసి ఉండి ఉండరు.. ఒకటి కాదు రెండు కాదు .. ఒకదాని తరువాత ఒకటి ఆలోచనలు వస్తూనే ఉన్నాయ్ .తనని ఎప్పుడు చూస్తాను .. ఎలా మాట్లాడాలి తనతో ..ఆలోచిస్తూ ఉండగానే  మా ఊరికి చేరుకున్నాను .. గుండెల్లో ఏదో తెలియని అనుభూతి నా 10th  తరవాత మళ్ళి రాలేదు.. ఊరు బాగా మారిపోయింది. తాటాకు ఇల్లు అన్ని పెంకేటు ఇల్లు అయ్యాయి ఇప్పుడు.. అందరు నాన్ను కొత్తగా చూస్తున్నారు.. ఇంటికి వెళ్ళకుండా పరిచయాలు దారిలోనే అయిపోతున్నాయ్ .. అదిగో మా తాతయ్య గారి ఇల్లు కొంచెం మార్పు వచ్చింది కాని అలానే ఉంది.

తాతయ్య గారి గేటు తిస్తుంటేనే గుండెల్లో ఏదో అలజడి .. తాతయ్యని చూసి చాలారోజులు అయ్యింది. అడిగో తాతయ్య కుర్చీలో కుర్చుని పేపర్ చదువుతున్నాడు.. నేను ఇంటిలోకి వెళ్తుండగానే తాతయ్యకు నాకు ఎదురు వచ్చారు.. ఏరా ప్రయాణం బాగా జరిగిందా ? అమ్మానాన్న ఎలాఉన్నారు ? తాతయ్య గారే నా బాగ్ తీసుకుని లోపలికి వెళ్తుండగా ఏం చెప్పాలో తెలియక సిగ్గుతో వెనకాల నడిచాను..  ఏరా ఇంతకాలానికి గుర్తువచ్చానా అన్నాడు  తాతయ్య  ఏం చెప్పాలో తెలియలేదు. ఇంతలోపే మామయ్య  ..

2 comments:

  1. హం.... బహు బాగు, కాని ఇలా సగం లో వొదిలేస్తే ఎలా......

    ReplyDelete