Monday, September 26, 2016

నీతో గడిపిన మధుర క్షణాలు

     ఏమిటి ఆ క్షణాలు అనుకుంటున్నావా ! ఎన్నన్ని చెప్పను చెప్పు .. 
ఒకట రెండా రాస్తే పెద్ద గ్రంథం అవుతుందేమో .
ఆ..  కోప్పడకు ఇంతకాలానికి ఇప్పడికి సమయం దొరికింది . ఈ చల్లటి గాలి తగులుతూంటే నువ్వు నన్ను వెనకాలనుంచి వచ్చి ప్రేమ గా హద్దుకున్న క్షణాలు గుర్తుకోస్తున్నాయ్ .
****** 

మన పెళ్లి జరుగుతున్నప్పుడు గుర్తుందా నీకు ...
చుట్టురా అందరూన్న నేను అవి ఏవి పట్టించుకోకుండా మన మధ్య లో కట్టిన దుప్పటి క్రిందనుంచి నీ కాళ్ళ వేళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తూంటే దొంగచూపులు చూసాను . అప్పుడప్పుడు నువ్వు పూజలు చేస్తూ నీ చేతికి తడౌవుతుంటే ఆ తెల్లటి kerchief కు తుడుస్తూ ఉన్నప్పుడు నీ చేతులను చూసేవాణ్ణి . ఆ చేతులేగా నేను జీవితాంతం పట్టుకోవాల్సింది ( పట్టుకోకపోతే చంపేయవు  :) )అనుకుంటూ చూస్తూ ఉండేవాణ్ణి ఎప్పుడు ఈ దుప్పటి అడ్డు తీస్తారా అని . జీలకర్ర బెల్లం ఘట్టం ఎలా మరువగలను నీకళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే . అందరిలోనూ నువ్వు చూడలేక కాస్త సిగ్గుపడుతూ తల దించుకుని రెండు క్షణాలాగి నువ్వు చూసిన చూపు ఎన్ని జన్మలకు మరువగలను . ఫ్రెండ్స్ అందరు తల పైకి ఎత్తార అంటే నేను తల పైకి ఎత్తబోతుంటే నా తలపై జీలకర్ర బెల్లం దానిపై నీ చెయ్యి .. కనబడవ్ కాని నువ్వు చేత్తో తలపైకి ఎత్తకుండా తలపై నొక్కావ్ చూడు .. అప్పటినుంచి తలపైకి ఎత్తే అవకాసమే రాలేదు :)

తాళి కడుతున్న ఘట్టం ఉంది చూసావు .. ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు అంత టెన్సన్ పడలేదు . ఎవడు లేచి ఆపండి అంటాడేమో అని . ఎవడు ఆపినా నేను ఆగాను అనుకుంటూ తాళి కట్టాను తెలుసా .. ఆ వెనకాల ఉన్నవాళ్లు నువ్వు 4 ముళ్ళు వేసావ్ అంటూంటే .. ఆసలే నా కంగారు లో నేనుంటే వీల్లోకరు మద్యలో అనుకున్నా . కోతికి కొబ్బరికాయ దొరికినట్టు తలంబ్రాలు అని అనగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది . దానికితోడు ఫ్రెండ్స్ పోసేయ్ పోసేయ్ అంటూంటే .. ఆహా అప్పుడు తెల్సింది నువ్వు సామాన్యరాలువి కాదని . నాకంటే స్పీడ్ గా పోస్తూంటే నాకు తగ్గ జోడినే అనుకున్నా . నీకో విషియం తేల్సా నువ్వు మీ నాన్నగార్ని వదిలి కార్ ఎక్కుతున్నప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే మామయ్య గారు నేను ఉన్నాను ఏమి బెంగవద్దు అని చెప్పాలని ముందే question paper లీక్ అయితే ఆన్సర్ తేల్సినట్టు ప్రిపేర్ అయ్యాను . కాని నీ కళ్ళలోంచి కన్నీళ్ళు ముత్యాలు రాలుతున్నట్టు .. శివుడి తలపై నుంచి గంగమ్మ దూకుతున్నట్టు కన్నీళ్ళు  వస్తూంటే నాకు ఏమి చెయ్యాలో తేలియలేదు నీ భుజం పై చేయ్యివెయడం తప్ప . అన్నవరం వ్రతానికి వెళ్తున్నాం అప్పుడు నీ అరిచేతిని నా అరిచేతిలో బంధించి నీ దుఖాన్ని ఆపడానికి నా చేతితో మౌన భాషగా చాలానే చెప్తున్నాను నీకు వినిపించాయో లేదో మరి .
కార్ వెళ్తూంది మన తో పాటు వస్తున్నా పెద్దవాళ్ళు నన్ను ఏదో అడుగుతున్నారు నేనేదో చెప్తున్నాను కాని నా ద్యసాంతా నీ పైనే . నీ కళ్ళు బాగా ఎరుపెక్కాయ్.. ఉన్నట్టు ఉండి మా పెద్దమ్మా కు కడుపులో వికారంగా ఉంది అంటే కార్ ఆపుచేసారు ..డ్రింక్ లు టీ లు త్రాగి . నీకో డ్రింక్ ఇస్తే నాకు వద్దు అంటూ సగం తాగి వదిలేసావ్ .. ఆ తరువాత కదా నువ్వు మామోలు మనిషివి అవుతా . నాకు ఏమనిపించిందో చెప్పనా ఈ పెద్దమ్మ కు ఓ అరగంట క్రితమే వికారంగా ఉంటే బాగున్ను అనిపించింది :)
 *****
నేనేదో ఆలోచిస్తున్న ఆ రోజు .. ఏవండి ఏవండి అని నువ్వు పిలుస్తున్న వినబడని పిలుపు ఓయ్ అని పిలిచేసరికి ఈ లోకం లోకి వచ్చాను . ఏమిటే .. ఓసారి ఇలా రండి .. ఆ చెప్పు .. నువ్వు చెప్పినది  అంత విన్నాక నీవైపు చూస్తున్న ఇంకా ఏదో చెప్తావ్ అని .. నీ మొహం లో భావాలూ మారడం గమనించి తరువాత అన్నాను . నువ్వు కోపంగా నేను చెప్పింది జోక్ అన్నావ్ .. తేరుకున్న నేను నీ కోసం 5 నిమిషాలు ఆగకుండా నవ్వాను .. నాకేంతెలుసు నీకు నవ్విన కోపం వస్తుంది అని .. పక్కన ఉన్న తలగడితో కొట్టి ఆపండి ఇంక .. మీరు రోజు చెప్పే కుళ్ళు జోకిలికి నేను నవ్వడం లేదా  అన్నావ్ .. ఓర్ని ఇంకా నయం 30 స॥ తరువాత అంత మీరే చేసారు అని అనలేదు . సరే ఇకపై నేను జోక్స్ చెప్పను .. చెప్పకుండానే నవ్విస్తా .. అన్నాను . నువ్వు కళ్ళు రెండు ఎగరేస్తూ ఎలానో అన్నావ్ . అప్పుడు నేను నిన్ను దగ్గరకు తీస్కుని కితకితలు పెట్టడం స్టార్ట్ చేశాను . 15 ని ॥ తరువాత నీ కళ్ళలో నవ్వలేక ఆనంద భాష్పాలు వస్తుంటే ఆపాను . నువ్వు రెండు నిమిషాలు ఊపిరి పీల్చుకుని నా బుగ్గ కోరికి పారిపోయావ్ .. ఎలా మరువగలను .
****

No comments:

Post a Comment